బుధవారం 08 జూలై 2020
National - Jun 26, 2020 , 13:51:07

జమ్ములో ముగ్గురు ఉగ్రవాదుల హతం

జమ్ములో ముగ్గురు ఉగ్రవాదుల హతం

పుల్వామా: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతున్నది. పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతాబలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు. అవంతీపురా సమీపంలోని చెవా ఉలార్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతా దళాలు, స్థానిక పోలీసులు సంయుక్తంగా శుక్రవారం ఉదయం కార్డన్‌ సెర్చ్‌ చేపట్టాయి. ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో భద్రతా దళాల ఎదురు కాల్పుల్లో ముగ్గురు చనిపోయారు. 

ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతున్నదని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి లభించిందని వెల్లడించారు. సోపోర్‌లో జూన్‌ 25న భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుపెట్టారు. 


logo