బుధవారం 28 అక్టోబర్ 2020
National - Sep 19, 2020 , 02:06:16

ఆ జవాన్లపై చర్యలు!

ఆ జవాన్లపై చర్యలు!

  • షోపియాన్‌ ‘ఎన్‌కౌంటర్‌'లో కూలీల మరణంపై ఆర్మీ ప్రకటన 

శ్రీనగర్‌, సెప్టెంబర్‌ 18: ఈ ఏడాది జూన్‌లో జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలో జరిగిన ఒక ఎన్‌కౌంటర్‌ విషయంలో తమ బలగాలు సైనిక బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (ఏఎఫ్‌ఎస్‌పీఏ) అతిక్రమించినట్లు ఆధారాలు లభించాయని సైన్యం వెల్లడించింది. ఈ మేరకు సంబంధింత జవాన్లపై క్రమశిక్షణాచర్యలకు ఆదేశించినట్లు పేర్కొన్నారు. జూలై 18న షోపియాన్‌లోని అమ్షిపుర గ్రామంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మిలిటెంట్లు హతమైనట్లు నాడు సైన్యం తెలిపింది. అయితే వారు ముగ్గురు రౌజౌరీ జిల్లాలకు చెందిన కూలీలని వార్తలు రావడంతో ఈ ఘటనపై సైన్యం విచారణకు ఆదేశించింది. వారు ముగ్గురు రాజౌరికి చెందినవారిగా విచారణలో తేలింది. 


logo