బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 29, 2020 , 13:57:38

ఉగ్ర‌వాద స‌హ‌చ‌రులు ముగ్గురు అరెస్టు

ఉగ్ర‌వాద స‌హ‌చ‌రులు ముగ్గురు అరెస్టు

శ్రీ‌న‌గ‌ర్ : ఉగ్ర‌వాద స‌హ‌చ‌రులు ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘ‌ట‌న జ‌మ్ముక‌శ్మీర్ రాష్ర్టం బందీపోరా జిల్లాలో మంగ‌ళ‌వారం రాత్రి చోటుచేసుకుంది. బందీపోరా పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఈ ముగ్గురిని అరెస్టు చేయడం తమకు ఓ ర‌క‌మైన‌ విజయాన్ని చేకూర్చింద‌న్నారు. ఇంట‌రాగేష‌న్ అనంత‌రం ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికి, కార్యకలాపాల గురించి వెల్ల‌డించిన‌ట్లు తెలిపారు.

అరెస్టు చేసిన ఉగ్ర‌వాద స‌హ‌చ‌రుల‌ను అబ్రార్ గుల్జార్, మొహమ్మ‌ద్ వకార్, మునీర్ అహ్మద్ షేక్‌గా గుర్తించారు. ఉపా చ‌ట్టం కింద అరెస్టు చేసిన వీరిపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు. నిందితులు ఉగ్ర‌వాదుల‌కు స‌హాయ స‌హ‌కారాలు అందించ‌డంతో పాటు ప‌లు విధ్వంస‌క చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ్డ‌ట్లు తెలిపారు. కేసులో త‌దుప‌రి ద‌ర్యాప్తు కొన‌సాగ‌నున్న‌ట్లు పేర్కొన్నారు.


logo