శనివారం 26 సెప్టెంబర్ 2020
National - Aug 11, 2020 , 08:16:59

ముగ్గురిని అదుపులోకి తీసుకున్న సైన్యం

ముగ్గురిని అదుపులోకి తీసుకున్న సైన్యం

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని కుప్వారాలో ముగ్గురు అనుమానితులను భారత సైన్యం, భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. జమ్మూ కాశ్మీర్ పోలీస్ తెలిపిన వివరాల ప్రకారం..  కుప్వారాలోని లాల్‌పురాలో సోమవారం సాయంత్రం జాయింట్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ ప్రారంభంచారు. ఇందులో ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఒకటి ఏకే47, రెండు పిస్తోల్స్‌తో పాటు మ్యాగజైన్‌, మందుగుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.  జాయింట్‌ ఆపరేషన్‌ పురోగతిలో ఉందని, ఇంకా కొనసాగుతుందని ఇండియన్ ఆర్మీకి చెందిన చినార్‌ కార్ప్స్‌ పేర్కొంది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo