బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Mar 04, 2020 , 13:40:11

కాల్వలోకి దూసుకెళ్లిన కారు : ముగ్గురు మృతి

కాల్వలోకి దూసుకెళ్లిన కారు : ముగ్గురు మృతి

పశ్చిమ గోదావరి : జిల్లాలోని పొద్దూరు మండలం జగన్నాథపురం బ్రిడ్జి సమీపంలో బుధవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి బ్రిడ్జికి సమీపంలో ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. రొయ్యల విత్తనాలు కొనేందుకు కాకినాడ నుంచి పాలకొల్లు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. క్రేన్‌ సహాయంతో కారును బయటకు తీశారు పోలీసులు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పాలకొల్లు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులను కే సురేశ్‌(22), సీహెచ్‌ చిట్టెయ్య(45), సీహెచ్‌ కాశి(22)గా గుర్తించారు. ప్రమాదానికి గురైన కారు నంబర్‌ - ఏపీ 37 ఏడబ్ల్యూ 5777. 


logo