బుధవారం 15 జూలై 2020
National - Jun 24, 2020 , 16:57:55

యూపీలో పిడుగులు ప‌డి ముగ్గురు మృతి

యూపీలో పిడుగులు ప‌డి ముగ్గురు మృతి

ల‌క్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షంతోపాటు పిడుగులు ప‌డి ముగ్గురు మృతిచెందారు. ప‌లువురు గాయ‌ప‌డ్డారు. ఉన్న‌వ్‌, ఫ‌తేపూర్‌, జ‌లాన్ ప్రాంతాల్లో పిడుగులు ప‌డ్డాయి. కాగా, పిడుగులు ప‌డి ఒకేరోజు ముగ్గురు మృతిచెంద‌డంపై ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగీ ఆదిత్య‌నాథ్ విచారం వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు సానుభూతి తెలియ‌జేయ‌డంతోపాటు ఒక్కో కుంటుంబానికి రూ.4 ల‌క్ష‌ల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించారు. 

పిడుగుపాట్ల వ‌ల్ల గాయ‌ప‌డ్డ క్ష‌త‌గాత్రుల‌కు స‌రైన వైద్య సౌక‌ర్యాలు అందేలా చూడాల‌ని అధికారులకు యూపీ సీఎం సూచించారు. తీవ్రంగా గాయ‌ప‌డ్డ వారికి అత్య‌వ‌స‌ర సేవ‌లు అందేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు.            ‌                logo