సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 30, 2020 , 12:29:12

అస్సాం రైఫిల్స్ యూనిట్‌పై ఉగ్ర‌దాడి

అస్సాం రైఫిల్స్ యూనిట్‌పై ఉగ్ర‌దాడి

హైద‌రాబాద్‌: మ‌ణిపూర్‌లో ఇవాళ నాలుగ‌వ అస్సాం రైఫిల్స్ యూనిట్‌పై ఉగ్ర‌వాదులు దాడి చేశారు.  ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు జ‌వాన్లు మృతిచెందారు. మ‌రో న‌లుగురు గాయ‌ప‌డ్డారు.  మ‌య‌న్మార్‌తో ఉన్న స‌రిహ‌ద్దు వ‌ద్ద ఈ దాడి ఘ‌ట‌న జ‌రిగింది.  చందేల్ జిల్లాలోని పీపుల్స్ లిబ‌రేష‌న్ ఆర్మీకి చెందిన స్థానిక ఉగ్ర‌వాదులు దాడికి పాల్ప‌డి ఉంటార‌ని అంచ‌నా వేస్తున్నారు.  తొలుత ఉగ్ర‌వాదులు ఐఈడీ పేలుడుకు పాల్ప‌డ్డారు. ఆ త‌ర్వాత వారు జ‌వాన్ల‌పై కాల్పులు జ‌రిపారు. ఇంఫాల్‌కు వంద కిలోమీట‌ర్ల దూరంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. దాడి ఘ‌ట‌న తెలుసుకున్న అధికారులు ఆ ప్రాంతానికి ప్ర‌త్యేక ద‌ళాల‌ను పంపించారు. మ‌ణిపూర్‌లోని పీఎల్ఏ వేర్పాటువాద ఉద్య‌మం కొన‌సాగిస్తున్న‌ది. అయితే ఆ ఉగ్ర సంస్థ‌కు చైనా నుంచి ఆర్థిక‌, ఆయుధ స‌హ‌కారం ల‌భిస్తున్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దాని వ‌ల్లే ఆ సంస్థ ఈశాన్య రాష్ట్రాల్లో త‌న ప్రాబ‌ల్యాన్ని పెంచుకున్న‌ది.  ద‌శాబ్ధాలుగా ఇదే త‌ర‌హా చొర‌బాట్లు జ‌రుగుతున్న‌ట్లు ఇంటెలిజెన్స్ అధికారులు భావిస్తున్నారు.  
logo