ఆదివారం 25 అక్టోబర్ 2020
National - Aug 10, 2020 , 18:36:58

సెల్‌ఫోన్‌ పేలి ముగ్గురు మృతి

సెల్‌ఫోన్‌ పేలి ముగ్గురు మృతి

చెన్నై: చార్జింగ్ పెట్టిన మొబైల్ ఫోన్ పేల‌డంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన ఘ‌ట‌న త‌మిళ‌నాడు రాష్ట్రం క‌రూర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. క‌రూర్ జిల్లాకు చెందిన ముత్తుల‌క్ష్మి అనే మ‌హిళ రాత్రి ప‌డుకునే ముందు సెల్‌ఫోన్‌ ఛార్జింగ్ పెట్టి రంజిత్, ద‌క్షిత్ అనే త‌న ఇద్దరు పిల్లలతో కలిసి నిద్ర‌పోయింది. అయితే ఫోన్ బాగా వేడెక్కి ఒక్కసారిగా పేలిపోయింది. ఫోన్ నుంచి మంట‌లు చెల‌రేగి ఇంట్లోని ప‌రుపు, బెడ్ షీట్ల‌కు అంటుకోవ‌డంతో గ‌ది మొత్తం తగుల‌బ‌డింది. ఈ మంట‌ల్లో త‌ల్లి ముగ్గురు కాలిపోయారు. 

పిల్ల‌లు రంజిత్‌, ద‌క్షిత్ అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోగా.. తీవ్రంగా గాయ‌ప‌డ్డ త‌ల్లి ముత్తుల‌క్ష్మి ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ ఘటనపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. చార్జింగ్ ఎక్కువ కావ‌డంతోనే మొబైల్ పేలింద‌ని పోలీసుల ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింది. ప్ర‌మాద‌వ‌శాత్తు ఒకే కుటుంబంలో ముగ్గురు మర‌ణించ‌డంతో స్థానికంగా విషాద చాయ‌లు అలుముకున్నాయి. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo