మంగళవారం 27 అక్టోబర్ 2020
National - Sep 27, 2020 , 17:36:39

నకిలీ డాక్టరేట్‌ పట్టాలు విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులు అరెస్టు

 నకిలీ డాక్టరేట్‌ పట్టాలు విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులు అరెస్టు

 బెంగళూరు : కర్ణాటకా, మైసూర్ లో నకిలీ యూనివర్సిటీ డాక్టరేట్‌ పట్టాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అదో పెద్ద హోటల్‌. సమావేశ గదిలో కోలాహలం. కొందరు స్నాతకోత్సవ గౌన్లు ధరించి.. డాక్టరేట్లు అందుకోబోతున్నామనే ఆనందంలో ఉన్నారు. ఇంతలో పోలీసులొచ్చారు. ముగ్గురిని అరెస్ట్‌చేశారు. అక్కడి నకిలీ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ పట్టాలను స్వాధీనం చేసుకున్నారు. అసలు ఏం జరిగిందంటే... తమిళనాడుకు చెందిన కొందరు ఇంటర్నేషనల్‌ గ్లోబల్‌ పీస్‌ యూనివర్సిటీ అనే నకిలీ వర్సిటీ పేరుతో దందా చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు మైసూర్‌లో ఓ హోటల్‌పై దాడిచేశారు. ఔత్సాహికుల నుంచి భారీగా డబ్బు తీసుకుని నకిలీ డాక్టరేట్లు ప్రదానం చేస్తున్నట్లు నంబియార్, శ్రీనివాస్, మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌చేశారు. ఆ సమయంలో హోటల్‌లో సుమారు 142 మందికి గౌరవ డాక్టరేట్‌ పట్టాలిస్తున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.



logo