గురువారం 26 నవంబర్ 2020
National - Nov 13, 2020 , 15:16:29

యూపీలో క‌ల్తీ మ‌ద్యం తాగి ముగ్గురు మృతి

యూపీలో క‌ల్తీ మ‌ద్యం తాగి ముగ్గురు మృతి

ల‌క్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని ల‌క్నోలోని బంతారా ఏరియాలో క‌ల్తీ మ‌ద్యం సేవించి ముగ్గురు వ్య‌క్తులు మృతిచెందారు. మ‌రో ఇద్దరి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. ప్ర‌స్తుతం వారు ప్రాణాపాయ స్థితిలో స్థానిక ట్రామా కేర్ సెంట‌ర్‌లో చికిత్స పొందుతున్నారు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. సుంద‌ర్ లాల్ (35), అచ్చె (30), రాజ్‌కుమార్ (32), మ‌రో ఇద్ద‌రు వ్య‌క్తులు క‌లిసి గురువారం రాత్రి మ‌ద్యం సేవించారు. అయితే రాత్రి నిద్ర‌పోయిన త‌ర్వాత సుంద‌ర్‌లాల్‌, అచ్చె, రాజ్‌కుమార్ ముగ్గురూ అస్వ‌స్థ‌త‌కు గురికావ‌డంతో వారివారి కుటుంబ‌స‌భ్యులు స్థానిక ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. 

చికిత్స పొందుతూ రాత్రే వారు ప్రాణాలు కోల్పోయారు. వారితోపాటు మ‌ద్యం సేవించిన మిగ‌తా ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మృతుల పోస్టుమార్టం రిపోర్టు వ‌స్తే వారి మ‌ర‌ణాల‌కు కార‌ణం తెలుస్తుంద‌న్నారు. వారు కల్తీ మ‌ద్యం సేవించ‌డంవ‌ల్లే చ‌నిపోయారా లేదంటే అతిగా మ‌ద్యం సేవించ‌డంవ‌ల్ల చ‌నిపోయారా అనేది పోస్టుమార్టం రిపోర్టుతో తేలిపోతుంద‌ని చెప్పారు. అదేవిధంగా ప‌రారీలో ఉన్న మ‌ద్యం దుకాణం య‌జ‌మాని కోసం గాలిస్తున్న‌ట్లు తెలిపారు.    

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.