బుధవారం 27 మే 2020
National - May 21, 2020 , 11:54:12

ముగ్గురు లష్కరే ఉగ్రవాదులు అరెస్ట్‌

ముగ్గురు లష్కరే ఉగ్రవాదులు అరెస్ట్‌

శ్రీనగర్‌ : లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను జమ్మూకశ్మీర్‌ పోలీసులు అరెస్టు చేశారు. కుప్వారా జిల్లాలోని సోగమ్‌లో జమ్మూకశ్మీర్‌ పోలీసులు, సీఆర్పీఎఫ్‌ బలగాలు సంయుక్తంగా ఆపరేషన్‌ నిర్వహించాయి. ఈ ఆపరేషన్‌లో ముగ్గురు ఉగ్రవాదులు పట్టుబడ్డట్లు పోలీసులు తెలిపారు. ఈ ముగ్గురు ఇటీవలి కాలంలోనే లష్కరే తోయిబా సంస్థలో చేరినట్లు చెప్పారు. ముగ్గురిలో ఇద్దరిని జకీర్‌ అహ్మద్‌ భట్‌, అబిద్‌ హుస్సేన్‌ వానీగా పోలీసులు గుర్తించారు. 

పుల్వామా జిల్లాలోని అవంతిపురా సెక్టార్‌లో జైషే మహ్మద్‌ ఉగ్రవాదుల శిబిరాన్ని పోలీసులు ధ్వంసం చేసిన విషయం విదితమే. శ్రీనగర్‌లోని పండాచ్‌ ఏరియాలో బీఎస్‌ఎఫ్‌ బలగాలపై ఉగ్రవాదులు దాడులు జరపగా ఇద్దరు జవాన్లు మృతి చెందారు. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. logo