గురువారం 04 జూన్ 2020
National - Apr 02, 2020 , 15:16:11

ఏపీలో మ‌రో మూడు కొత్త క‌రోనా కేసులు

ఏపీలో మ‌రో మూడు కొత్త క‌రోనా కేసులు

ఏపీలో క‌రోనా పాజిటివ్ కేసులు కొత్త‌గా మ‌రో మూడు న‌మోద‌య్యాయి. దీంతో ఏపీలో క‌రోనా బాధితుల సంఖ్య 135కి చేరింది. ఈమేర‌కు  అక్క‌డి వైద్య ఆరోగ్య‌శాఖ క‌రోనా హెల్త్ బులిటెన్ విడుద‌ల చేసింది.  ఇవ్వాళ ఉద‌యం 9 త‌ర్వాత మ‌రో ముగ్గురికి పాజిటివ్ గా తేలిందన్న అక్క‌డి వైద్య ఆరోగ్య‌శాఖ‌... దీంతో ఈ రోజు 24 పాజిటివ్ కేసులు న‌మోదయ్యాయని తెలిపింది. ఇక  ఢిల్లీ మ‌ర్క‌జ్ వెళ్లి వ‌చ్చిన 1,085 మందిని గుర్తించిన‌ట్లు అధికారులు తెలిపారు. అందులో 758మందికి వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన‌ట్లు పేర్కొన్నారు. ఇంకా మిగ‌తా వారిని గుర్తించేందుకు చ‌ర్య‌లు చేప‌డ‌తున్నామ‌న్నారు. అటు మ‌ర్క‌జ్ వెళ్లివ‌చ్చిన 91మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింద‌ని అధికారులు వివ‌రించారు.  రాష్ట్రంలో మ‌రో రెండు క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షా కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయ‌ని తెలిపారు. గుంటూరు, క‌డ‌ప‌లో రెండు ప‌రీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయ‌బోతున్న‌ట్లు చెప్పిన‌ అధికారులు ఈ నెల 4 నుంచి అందుబాటులోకి వ‌స్తాయ‌న్నారు.


logo