బుధవారం 27 మే 2020
National - May 13, 2020 , 17:53:32

ఇంటికి చేరుతామనగా పలకరించిన మృత్యువు

ఇంటికి చేరుతామనగా పలకరించిన మృత్యువు

లక్నో: లాక్‌డౌన్‌ నేపథ్యంలో వివిధ ప్రదేశాల నుంచి సొంత గ్రామాలకు వెళ్తున్న వలస కూలీలను మృత్యువు కబలించింది. మరికాసేపట్లో ఇంటికి చేరుకొని కుటుంబంతో హాయిగా ఉందామని అనుకొన్నవారికి మృత్యువు ప్రమాదం రూపంలో పలకరించింది. ఈ  ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కన్పూర్‌-ఝాన్సీ జాతీయ రహదారిపై జరిగింది.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన దాదాపు 50 మంది కూలీలు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నుంచి సొంతూళ్లకు బయల్దేరారు. కొద్ది సేపట్లో లక్నో చేరుకొనేలోపు మరో ట్రక్కు వచ్చి వీరు ప్రయాణిస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. దాంతో ఇద్దరు పెద్దలు సహా మరో చిన్నారి దుర్మరణం చెందారు. మరో 40 మందికి గాయాలయ్యాయి. వీరిని కాన్పూర్‌లోని లాలా లజపత్‌రాయ్‌ ప్రభుత్వ దవాఖానకు చికిత్స నిమిత్తం తరలించారు.


logo