బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 22, 2020 , 17:44:41

చెల్లిని చంపిన అన్న‌లు.. ముగ్గురు అరెస్ట్‌

చెల్లిని చంపిన అన్న‌లు.. ముగ్గురు అరెస్ట్‌

థానే: మ‌హారాష్ట్ర‌లోని థానే జిల్లాలో సొంత చెల్లిని చంపిన అన్న‌ల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం న‌లుగురు సోద‌రులు క‌లిసి త‌మ సోద‌రిని హ‌త్య‌చేయ‌గా తాజాగా న‌థా అశోక్ పాటిల్‌, భ‌గ‌వాన్ అశోక్ పాటిల్‌, బాలాజీ అశోక్ పాటిల్ అనే ముగ్గురు నిందితుల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మ‌రో నిందితుడు పాండురంగ్ అశోక్ పాటిల్‌ కోసం గాలిస్తున్నారు. వివ‌రాల్లోకి వెళ్తే.. థానే జిల్లాలోని దాయ్‌గ‌ఢ్ గ్రామానికి చెందిన‌ ప్ర‌తిభ మాత్రే అనే 29 ఏండ్ల‌ మ‌హిళ భ‌ర్త‌తో గొడ‌వ‌ల కార‌ణంగా విడాకులు తీసుకుని పుట్టింట్లో ఉంటున్న‌ది. 

త‌ల్లిదండ్రులు లేక‌పోవ‌డంతో సోద‌రులతో క‌లిసి ఉంటూ ఓ బార్ షాప్‌లో ప‌నిచేస్తున్న‌ది. అయితే, సోద‌రి ప్ర‌వ‌ర్త‌న న‌చ్చ‌ని సోద‌రులు త‌ర‌చూ ఆమెను వేరుగా ఉండాలంటూ గొడ‌వ‌ప‌డేవారు. ఈ నేప‌థ్యంలోనే గ‌త మే 1న రాత్రి న‌లుగురు సోద‌రులు క‌లిసి ఆమె గొంతు పిసికి చంపేశారు. అనంత‌రం మృత‌దేహాన్ని ప్లాస్టిక్ సంచిలోపెట్టి పొలంలో కిరోసిన్ పోసి త‌గుల‌బెట్టారు. ఈ హ‌త్య గురించి గ్రామస్తుల ద్వారా పోలీసుల‌కు స‌మాచారం చేర‌డంతో నిందితులు పారిపోయారు. అప్ప‌టి నుంచి నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు మంగ‌ళ‌వారం రాత్రి ముగ్గురు ప‌ట్టుబ‌డ్డారు.         

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo