బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 20, 2020 , 11:02:34

ఉత్తరాఖండ్‌లో వరదల్లో చిక్కుకొని ముగ్గురు మృతి

ఉత్తరాఖండ్‌లో వరదల్లో చిక్కుకొని ముగ్గురు మృతి

పితోరాఘడ్ : ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీగా వరదలు ప్రవహిస్తున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్‌లోని పితోరాఘడ్ జిల్లా మడ్‌కట్ గ్రామంలో వరదనీటిలో చిక్కుకొని ముగ్గురు ప్రాణాలు కొల్పోయారు. భారీగా ప్రవహిస్తున్న వరదల్లో మరో 11 మంది గల్లంతయ్యారు.

గల్లంతైన వారి కోసం సహాయక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. మ‌డ్‌కట్‌ గ్రామంలో గల్లంతైన వారి కోసం గాలిస్తున్నామని పితోరాఘడ్ జిల్లా కలెక్టరు వీకే జోగదాండే చెప్పారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo