సోమవారం 28 సెప్టెంబర్ 2020
National - Jun 24, 2020 , 13:10:41

స్విమ్మింగ్‌పూల్‌లో మునిగి ముగ్గురు మృతి

స్విమ్మింగ్‌పూల్‌లో మునిగి ముగ్గురు మృతి

న్యూఢిల్లీ: అమెరికాలో ఘోరం జ‌రిగింది. ఇంటి వెనుకగ‌ల స్విమ్మింగ్‌పూల్‌లో మునిగి భార‌త సంత‌తి కుటుంబానికి చెందిన ముగ్గురు వ్య‌క్తులు మృతిచెందారు. మృతుల్లో 62 ఏండ్ల భ‌ర‌త్ ప‌టేల్‌, ఆయ‌న 33 ఏండ్ల కూతురు నిషా ప‌టేల్‌, ఎనిమిదేండ్ల మ‌నుమ‌రాలు ఉన్నారు. మిడిల్‌సెక్స్ కౌంటీలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. మృతులు ఇటీవ‌ల ఆ ఇంట్లోకి వ‌చ్చిన‌ట్లు స్థానికులు తెలిపారు. 

ఇంట్లో నుంచి అరుపులు వినిపించ‌డంతో తాము పోలీసులకు స‌మాచార‌మిచ్చామ‌ని, పోలీసులు వ‌చ్చి ముగ్గురిని స్విమ్మింగ్ పూల్ నుంచి వెలికితీసి చూసేస‌రికి మృతిచెంది ఉన్నార‌ని స్థానికులు తెలిపారు. ఘ‌ట‌న గురించి 911 నెంబ‌ర్‌కు స‌మాచారం రావ‌డంతో ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నామ‌ని, వారిని స్విమ్మింగ్ పూల్ నుంచి వెలికితీసి సీపీఆర్ ఇచ్చినా ఫ‌లితం లేకుండా పోయింద‌ని పోలీసులు చెప్పారు. కాగా, ప్ర‌మాద‌వ‌శాత్తు నీటిలో మున‌గ‌డం వ‌ల్ల‌నే ఆ ముగ్గురు మృతిచెందిన‌ట్లు మిడిల్‌సెక్స్ కౌంటీ రిజీనల్ మెడిక‌ల్ ఎగ్జామిన‌ర్ తెలిపారు.         


logo