మంగళవారం 11 ఆగస్టు 2020
National - Aug 01, 2020 , 18:03:57

కరోనా పరీక్షల పేరిట డబ్బుల వసూలు.. ముగ్గురి అరెస్ట్‌

కరోనా పరీక్షల పేరిట డబ్బుల వసూలు.. ముగ్గురి అరెస్ట్‌

కోల్‌కతా : కరోనా పరీక్షల పేరిట ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి తప్పుడు రిపోర్టులు ఇచ్చారనే ఆరోపణలతో ముగ్గురు వ్యక్తులను కోల్‌కతాలో పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ముగ్గురిలో ఇద్దరు నగరంలోని వివిధ ప్రభుత్వ కాంట్రాక్టు ప్రయోగశాల సహాయకులుగా పని చేస్తున్నారని ఓ సీనియర్‌ అధికారి పేర్కొన్నారు.  కొవిడ్‌-19 పరీక్షలు చేసేందుకు నమూనాలను సేకరించేందుకు వారు నకిలీ ఐసీఎంఆర్‌ ఫారాలను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. పరీక్షలకు డబ్బులు తప్పుడు నివేదికలు ఇచ్చి మోసం చేశారని, మరణించిన ఓ రోగి కుటుంబ సభ్యుల ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇద్దరితో పాటు మరో వ్యక్తిని నేతాజీనగర్‌ ప్రాంతంలోని శుక్రవారం అర్ధరాత్రి అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo