వర్క్ ఫ్రం హోం.. సైకిళ్లపై ముంబై టు కన్యాకుమారి

ఒకవైపు వర్క్ ఫ్రం హోం చేస్తూనే.. మరోవైపు ముంబై నుంచి కన్యాకుమారికి వరకు సైకిల్‌పై సవారీ చేశారు ముగ్గురు మిత్రులు. వర్క్ ఫ్రం హోం విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా, ఆఫీసు పనికి ఎలాంటి అవాంతరాలు లేకండా చేస్తూనే.. మరోవైపు దాదాపు 1,687 కిలీమీటర్ల దూరాన్ని సైకిల్‌పై వెళ్లి కొత్త అనుభూతులకు లోనయ్యారు.
ముంబైకి చెందిన రతిశ్ భలేరావు, బాకెన్ జార్జీ, ఆల్విన్ జోసెఫ్.. ముగ్గురు స్నేహితులు. 20 ఏండ్లుగా ప్రాణస్నేహితులుగా ఉన్న ఈ ముగ్గురు.. మూడు వేర్వేరు ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే, కరోనా వైరస్ వ్యాప్తి నిరోధకానికిగాను వర్క్ ఫ్రం హోం ఇవ్వడంతో.. తొలుత ఈ ముగ్గురూ ఇంటికే పరిమితమై పనులు చేస్తూ వచ్చారు. అయితే, వర్క్ ఫ్రం హోంలో కాస్తా వెరైటీ ఉంటే బాగుంటుందని వీరికి వచ్చిన ఆలోచనే వారిని ముంబై నుంచి సైకిళ్లపై కన్యాకుమారి వెళ్లేలా చేసింది. మార్గమధ్యంలో ఆఫీసు పనిచేస్తూనే మొత్తం 1,687 కిలోమీటర్ల దూరం సైకిళ్లపై ప్రయాణించారు. ఆఫీసు పని చేయాల్సిన సమయంలో వారు ప్రయాణించే మార్గంలోని దాబాలు, హోటళ్లను ఎంచుకునే వారు. అక్కడ సేదతీరి స్వామికార్యం, స్వకార్యం కూడా పూర్తిచేసుకునేవారు. అలా మొత్తం యాత్రలో ఆఫీసు పనులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులు పూర్తిచేయగలిగారు. అదేవిధంగా, తమ ప్రయాణానికి కూడా ఎలాంటి అవాంతరాలు లేకుండా చేస్తుకోగలిగారు.
గతంలో ఇలాంటి సూదూర ప్రయాణాలు చేసిన అనుభవంతో ఈసారి కూడా మరేదైనా కొత్త ప్రదేశాన్ని ఎన్నుకోవాలని అనుకున్న బాకెన్ జార్జి.. విషయాన్ని మిగతా ఇద్దరి చెవిన వేశాడు. దాంతో వాళ్లు వెంటనే ఒప్పుకోవడం, కన్యాకుమారికి వెళ్లేందుకు మూకుమ్మడిగా తీర్మానం చేయడం చకచకా జరిగిపోయాయి. దాంతో నవంబర్ నెలలో తమ సైకిల్ సవారీని ప్రారంభించి డిసెంబర్ నెలాఖరుకు కన్యాకుమారి చేరుకుని తమ పర్యటనను విజయవంతంగా పూర్తిచేసుకున్నారు. సెలవులను, పనిదినాలను రోజూ ఎంజాయ్ చేయడం వల్ల మరింత ఉత్సాహంగా పనిచేసేలా తయారయ్యామని బాకెన్ జార్జి చెప్పారు. ముంబై నుంచి బయల్దేరిన తొలిరోజుల్లో ఎండ విపరీతంగా ఉండేదని, రాన్రాను వానలు కురువడం, చలికి వణకడం వంటివి కూడా అనుభవించామని జార్జి తన అనుభవాలను వెల్లడించారు.
సైకిళ్లపై అదనపు బారం పడకుండా కేవలం గాడ్జెట్స్‌తోనే పర్యటనకు బయల్దేరామని మరో స్నేహితుడు ఆల్విన్ జోసెఫ్ చెప్పాడు. ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి 11 గంటల వరకు ప్రయాణం చేయడం.. మార్గమధ్యంలో కనిపించే దాబాలు, హోటళ్ల వద్ద ఆగి ఆఫీసు పనులు చూసుకోవడం చేసేవారమని, తిరిగి సాయంత్రం ఆరు నుంచి రాత్రి 10 గంటల వరకు సైకిళ్లపై ప్రయాణించే వారమని తెలిపాడు. ఇలా నిత్యం 80 కిలీమీటర్ల దూరం ప్రయాణించేలా ప్లాన్ చేసుకునేవాళ్లమని, ఎట్టకేలకు విజయవంతంగా కన్యాకుమారి చేరుకున్నామని ఆల్విన్ జోసెఫ్ చెప్పాడు.
వారి షెడ్యూల్ సాధారణ పర్యాటకులు మాదిరిగా తమ చుట్టూ ఉన్న ప్రతి దాన్ని అన్వేషించడానికి అనుమతించనప్పటికీ, పర్యాటక రహిత అంశాలు వారి దృష్టిని ఆకర్షించాయని, ప్రయాణాన్ని చిరస్మరణీయంగా మార్చాయని వారు చెప్పారు. దాదాపు నెల రోజుల పర్యటనలో వీరు పుణే, సతారా, కొల్హాపూర్, బెల్గాం, హుబ్లీ, దావణగెరె, బెంగళూరు, సేలం, మాధురై, తిరునెల్వేలిలలోని సుందరమైన మార్గాల ద్వారా సైక్లింగ్ చేశారు. ఈ ప్రయాణంతో 26 రోజులపాటు హోటళ్లలో ఉండాల్సి రావడంతో ఒక్కొక్కరికి సుమారు రూ.25 వేలు ఖర్చయ్యాయంట. ఏదిఏమైనప్పటికీ.. కరోనా వైరస్ మహమ్మారి ఆఫీసు పనులతో రాజీ పడకుండా ఈ లక్ష్యాన్ని చేరుకునే అవకాశాన్ని తమకు అందడం అదో మధురానిభూతి అని వారు చెప్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- పదేండ్ల తర్వాత టీటీడీ కల్యాణమస్తు
- నేడు బీజేపీ ఎన్నికల కమిటీ భేటీ.. తొలి విడత అభ్యర్థుల ప్రకటన!
- స్నేహితురాలి పెళ్లిలో తమన్నా సందడి మాములుగా లేదు
- బ్లాక్ డ్రెస్‌లో రాశీ ఖన్నా గ్లామర్ షో అదిరింది...!
- ‘మోదీ ఫొటోలను తొలగించండి’
- బిల్డింగ్‌పై నుండి కింద పడ్డ నటుడు.. ఆసుపత్రికి తరలింపు
- శ్రీగిరులకు బ్రహ్మోత్సవ శోభ.. నేటి నుంచి మహాశివరాత్రి ఉత్సవాలు
- ఆర్ఆర్ఆర్ నుండి ఎన్టీఆర్, రామ్ చరణ్ పిక్ లీక్..!
- రాష్ట్రంలో పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు
- ఆశపెట్టి.. దోచేస్తారు