ఆదివారం 05 జూలై 2020
National - Jun 21, 2020 , 14:36:13

బైకుపై స్టంట్స్ చేస్తూ ముగ్గురు యువ‌కులు మృతి

బైకుపై స్టంట్స్ చేస్తూ ముగ్గురు యువ‌కులు మృతి

బెంగ‌ళూరు: బెంగ‌ళూరులో దారుణం జ‌రిగింది. బైకుపై స్టంట్స్ చేస్తూ ముగ్గురు యువ‌కులు మృతిచెందారు. బెంగళూరు విమానాశ్ర‌యానికి వెళ్లే ర‌హ‌దారిలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. బెంగ‌ళూరు న‌గ‌రంలోని గోవింద‌పుర ఏరియాల‌కు చెందిన ముగ్గురు యువ‌కులు ఆదివారం ఉద‌యం బెంగ‌ళూరు ఎయిర్‌పోర్టు రోడ్డుకు వెళ్లి బైకుపై విన్యాసాలు చేయ‌డం మొద‌లుపెట్టారు. అయితే, వారు స్టంట్స్ చేస్తుండ‌గానే ఒక్క‌సారిగా బైకు అదుపుత‌ప్పి ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు యువ‌కులు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. కాగా, ఈ ఘ‌ట‌న‌పై బెంగ‌ళూరులోని యెల‌హంక పోలీసులు కేసు న‌మోదుచేసి ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు. 


logo