గురువారం 04 జూన్ 2020
National - May 14, 2020 , 21:41:25

కేజీఎఫ్‌లో చోరీకి వెళ్లి ముగ్గురు మృతి

కేజీఎఫ్‌లో చోరీకి వెళ్లి ముగ్గురు మృతి

బెంగళూరు: కర్ణాటకలోని కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్‌ (కేజీఎఫ్‌) గనుల్లో దొంగతనానికి వెళ్లిన ముగ్గురు యువకులు మృత్యువాతపడ్డారు. కోలార్‌ జిల్లాలో ఉన్న బంగారు గనుల్లోకి బుధవారం రాత్రి ముగ్గురు దొంగలు ఇనుము వస్తువులు దొంగతనం చేసేందుకు గనుల్లోకి  చొరబడ్డారు. సుమారు వంద అడుగులు లోపలికి వెళ్లిన తర్వాత అదుపుతప్పి పెద్దగొయ్యిలో పడిపోయారు. విషవాయువు పీల్చి ఊపిరి ఆడక ముగ్గురు చనిపోయారని గురువారం పోలీసులు తెలిపారు. ఏడు గంటలపాటు శ్రమించి ఇద్దరి మృతదేహాలు వెలికి తీసినట్లు పోలీసులు చెప్పారు.


logo