బుధవారం 23 సెప్టెంబర్ 2020
National - Aug 13, 2020 , 07:23:17

పార్లమెంటు భవన నిర్మాణానికి మూడు కంపెనీలు షార్ట్‌ లిస్ట్‌

పార్లమెంటు భవన నిర్మాణానికి మూడు కంపెనీలు షార్ట్‌ లిస్ట్‌

న్యూఢిల్లీ: పార్లమెంటు కొత్త భవన నిర్మాణ కాంట్రాక్టు అప్పగించడం కోసం కేంద్రం మూడు కంపెనీలను షార్ట్‌ లిస్ట్‌ చేసింది. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న లార్సెన్‌ అండ్‌ టుబ్రో(ఎల్‌ అండ్‌ టీ) లిమిటెడ్‌, టాటా ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌, షపూర్‌జీ పల్లాంజీ అండ్‌ కంపెనీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలు తుది దశ బిడ్డింగ్‌కు అర్హత సాధించాయి. మొత్తం ఏడు కంపెనీలు పార్లమెంటు భవన నిర్మాణంపై ఆసక్తి చూపగా కేంద్ర ప్రజా పనుల విభాగం నాలుగు కంపెనీల దరఖాస్తులను తిరస్కరించింది. షార్ట్‌ లిస్ట్‌ అయిన మూడు కంపెనీలు త్వరలోనే తమ ఫైనాన్షియల్‌ బిడ్స్‌ను సమర్పించనున్నాయి. logo