గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 31, 2020 , 12:48:11

మూడు మెట్రో స్టేష‌న్ల‌కు మాజీ సీఎంల పేర్లు

మూడు మెట్రో స్టేష‌న్ల‌కు మాజీ సీఎంల పేర్లు

చెన్నై: అసెంబ్లీ ఎన్నికలు స‌మీపిస్తున్న వేళ ‌చెన్నైలోని మూడు ప్ర‌ధాన మెట్రో స్టేష‌న్ల‌కు ముగ్గురు మాజీ ముఖ్య‌మంత్రుల పేర్లు పెడుతూ త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న‌ది. చెన్నైలోని అలందూర్ మెట్రో స్టేష‌న్‌కు అరిగ్నార్ అలందూర్ మెట్రో, సెంట్ర‌ల్ స్టేష‌న్‌కు పుర‌చ్చి త‌లైవీ డా. ఎంజీ రామ‌చంద్ర‌న్ సెంట్ర‌ల్ మెట్రో, సీఎంబీటీ స్టేష‌న్‌కు పుర‌చ్చి త‌లైవీ డా. జే జ‌య‌ల‌లిత సీఎంబీటీ మెట్రో స్టేష‌న్‌గా పేరు మార్పుచేసింది. ఈమేర‌కు ఉన్న‌త‌స్థాయి క‌మిటీ సిఫార‌సు మేర‌కు స్టేష‌న్ల పేర్లు మార్చిన‌ట్లు సీఎం ప‌ళ‌నిస్వామి ప్ర‌క‌టించారు. 

చెన్నై మెట్రో రైలు ప్రాజెక్టు మొద‌టి ద‌శ‌లో ఈ మూడు స్టేష‌న్లు ప్ర‌ధాన‌మైన‌వి. 2019 లోక్‌స‌భ ఎన్నిక‌ల సందర్భంగా ఐకానిక్ చెన్సై సెంట్ర‌ల్ రైల్వే స్టేష‌న్‌కు ఏఐఏడీఎంకే వ్య‌వ‌స్థాప‌కుడు, మాజీ ముఖ్య‌మంత్రి ఎంజీఆర్ పేరు పెడతామ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్ర‌క‌టించారు.    

తాజావార్తలు


logo