శుక్రవారం 29 మే 2020
National - Apr 02, 2020 , 19:54:13

ఆశా వర్కర్‌పై దాడి ఘటన..ముగ్గురు అరెస్ట్‌

ఆశా వర్కర్‌పై దాడి ఘటన..ముగ్గురు అరెస్ట్‌

కర్ణాటక: కర్ణాటకలో కరోనా వైరస్‌ కేసులకు సంబంధించి వివరాలు సేకరిస్తుండగా..ఆశావర్కర్‌పై జరిగిన దాడి ఘటనలో పోలీసులు ముగ్గురు వ్యక్తులను అరెస్ట్‌ చేశారు. బెంగళూరులోని బ్యతరాయనపురలో ఆశావర్కర్‌ కృష్ణవేణి కరోనా కేసుల వివరాలు తెలుసుకునేందుకు వెళ్లగా..ఓ మసీదు ప్రాంగణం నుంచి ఆమెకు వ్యతిరేకంగా ప్రకటనలు చేశారు. ఆ తర్వాత ఆమెపై దాడి చేశారు.

ఈ ఘటనపై కృష్ణవేణి మాట్లాడుతూ..తమకు వ్యతిరేకంగా ప్రకటనలు చేసి దాడికి పాల్పడిన వ్యక్తులను అరెస్ట్‌ చేయాలని ఓ వీడియో పోస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు. 


logo