శనివారం 28 మార్చి 2020
National - Mar 27, 2020 , 12:28:56

పీజేపీ నేత హ‌త్య కేసులో ముగ్గ‌రు నిందితుల అరెస్ట్‌

పీజేపీ నేత హ‌త్య కేసులో ముగ్గ‌రు నిందితుల అరెస్ట్‌

ముంబై: మ‌హారాష్ట్రలో ఓ హ‌త్య కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురిని పోలీసులు శుక్ర‌వారం అరెస్ట్ చేశారు. ప్ర‌హార్ జ‌న‌శ‌క్తి పార్టీ (పీజేపీ) నేత తుషార్ పుంద్క‌ర్ హ‌త్య కేసులో ఈ ముగ్గురు నిందితులుగా  ఉన్నారు. అకోలా జిల్లాకు చెందిన తుషార్ పుంద్క‌ర్ పై ఫిబ్ర‌వ‌రి 21న అకోట్ న‌గ‌రంలోని పోలీస్‌ కాల‌నీలో కాల్పులు జ‌రిగాయి. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయ‌ప‌డ్డ పుంద్క‌ర్ ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ఫిబ్ర‌వ‌రి 22న మ‌ర‌ణించాడు. 

ఈ నేప‌థ్యంలో అకోలా జిల్లాలోని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు శుక్ర‌వారం ఉద‌యం ప‌వ‌న్ సెడాని (38), స్వ‌ప్నిల్ నాథే (22), అల్పేష్ దూబే (24) అనే ముగ్గ‌రు నిందితుల‌ను అదుపులోకి తీసుకున్నారు. పుంద్క‌ర్ త‌న సోద‌రుడిని హ‌త్య చేయించాడ‌న్న కార‌ణంతో క‌క్ష పెంచుకున్న ప‌వ‌న్‌ సెడానీ త‌న స్నేహితుల‌తో క‌లిసి హ‌త్య‌కు కుట్ర ప‌న్నిన‌ట్లు పోలీసులు తెలిపారు. నిందితుల‌పై ఐపీసీ 302 తోపాటు ఇత‌ర సెక్ష‌న్ల కింద కేసులు న‌మోదు చేసిన‌ట్లు వెల్ల‌డించారు.     


logo