గురువారం 09 ఏప్రిల్ 2020
National - Feb 19, 2020 , 09:39:23

జమ్మూకశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. త్రాల్‌లో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో సీఆర్పీఎఫ్‌ బలగాలు అక్కడ కూంబింగ్‌ నిర్వహించాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు.. బలగాలకు తారసపడ్డారు. మొదట ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్‌ జవాన్లపై కాల్పులు ప్రారంభించారు. దీంతో అప్రమత్తమైన బలగాలు కూడా ఉగ్రవాదులపై కాల్పులు జరిపి ముగ్గురిని మట్టుబెట్టారు. ఈ ముగ్గురు ఉగ్రవాదులు అన్సార్‌ గజ్వా ఉల్‌ హింద్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఉగ్రవాదులను జంగీర్‌ రఫిక్‌ వాణి, రాజా ఉమర్‌ మక్బుల్‌ భట్‌, ఉజైర్‌ అమీన్‌ భట్‌గా పోలీసులు పేర్కొన్నారు.


logo