సోమవారం 01 జూన్ 2020
National - May 18, 2020 , 13:21:29

వలస కూలీలతో కిక్కిరిసిన రామ్‌లీలా మైదానం

వలస కూలీలతో కిక్కిరిసిన రామ్‌లీలా మైదానం

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఉన్న రామ్‌లీలా మైదానం వలస కార్మికులతో కిక్కిరిసిపోయింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు శామిక్‌ ప్రత్యేక రైళ్లు రేపటి నుంచి వెళ్లనున్నాయి. దీనికోసం ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ను రామ్‌లీలా మైదానంలో ఏర్పాటు చేసింది. దీంతో తమ పేర్లు నమోదు చేసుకోవడానికి వేలాది వలస కార్మికులు రామ్‌లీలా మైదానాని చేరుకున్నారు. 

రాష్ట్రంలో వలస కార్మికులు ఎట్టి పరిస్తితుల్లో కాలినడకన గానీ, సైకిళ్లు, అనుమతి లేని వాహనాలపై వెళ్లడానికి అనుమంతించ కూడదని ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ అదికారులను ఆదేశించారు. దీంతో వలస కార్మికుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా బస్సులను నడుపుతున్నది. అదేవిధంగా శ్రామిక్‌ ప్రత్యేక రైళ్లను కూడా అధికసంఖ్యలో నడపాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.


logo