ఆదివారం 29 నవంబర్ 2020
National - Nov 09, 2020 , 20:36:48

మమ్మల్ని ముఠాగా పిలిచే వారే అతి పెద్ద దోపిడీదారులు: ఫరూక్

మమ్మల్ని ముఠాగా పిలిచే వారే అతి పెద్ద దోపిడీదారులు: ఫరూక్

శ్రీనగర్‌: తాము ఒక ముఠా కాదని, పార్టీల కూటమి అని జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్సీ) చీఫ్‌ ఫరూక్‌ అబ్దుల్లా తెలిపారు. మమ్మల్ని ముఠా అని పిలిచే వారు అతి పెద్ద దోపిడీదారులని ఆయన విమర్శించారు. అలాంటి వారే ప్రతి ఒక్కరినీ ఒక ముఠాగా చూస్తారంటూ పరోక్షంగా బీజేపీపై మండిపడ్డారు. తామంతా కలిసే ఎన్నికల్లో పోటీ చేస్తామని పీపుల్స్ అలయన్స్ ఫర్‌ గుప్కార్‌ డిక్లరేషన్‌ అధ్యక్షుడైన ఫరూక్‌ తెలిపారు. ఒకే ఎన్నికల చిహ్నం లభించదు కాబట్టి ఉమ్మడి అభ్యర్థులతో కూటమిలోని పార్టీల చిహ్నాలపై పోటీ చేస్తామని చెప్పారు.

తాము దేశానికి శత్రువులం కాదని బీజేపీకే శత్రువులమని ఫరూక్ అబ్దుల్లా పునరుద్ఘాటించారు. హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులను వేరుచేయాలని ఆ పార్టీ కోరుకుంటున్నదని ఆయన విమర్శించారు. అందరూ సమానమే అన్న మహాత్మా గాంధీ భారతదేశాన్ని తాము నమ్ముతున్నామని తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.