గురువారం 09 జూలై 2020
National - Apr 20, 2020 , 18:27:53

ఆ రెండు రాష్ట్రాలు క‌రోనా ఫ్రీ స్టేట్స్‌

ఆ రెండు రాష్ట్రాలు క‌రోనా ఫ్రీ స్టేట్స్‌

దేశంలో రోజురోజుకు క‌రోనా కేసుల పెరుగుతున్న వేళ‌..కాస్తా ఊర‌ట‌నిచ్చే అంశం. దేశంలో రెండు రాష్ట్రాలు క‌రోనా ఫ్రీ స్టేట్స్ గా మారాయి. ఆ రెండు రాష్ట్రాలు క‌రోనా నుంచి సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డాయి. మ‌ణిపూర్ ఒక‌టి కాగా, రెండో రాష్ట్రం గోవా. త‌మ రాష్ట్రంలో ప్ర‌స్తుతం ఒక్క క‌రోనా కేసు కూడా లేద‌ని ప్ర‌క‌టించుకున్నాయి.  కోవిడ్ సోకిన ఇద్దరు వ్యక్తులు పూర్తిగా కోలుకున్నారని మ‌ణిపూర్‌ సీఎం బిరేందర్ సింగ్ ప్రకటించారు. ఆపై ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదంటూ ఆయన ట్వీట్ చేశారు. 

ఇక త‌మ‌ రాష్ట్రం నుంచి కూడా కరోనా పారిపోయిందంటూ  గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్  ప్రకటించారు. ఏప్రిల్ 3 నాటికే ఏ కొత్త కరోనా కేసు నమోదు కాలేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో కోవిడ్ లేదని చెప్పడం తనకెంతో సంతోషాన్ని ఇస్తుందన్నారు. వైద్య సిబ్బంది తో పాటు ప్రజల సహకారం తోడవడం వలనే ఇది సాధ్యమైందని వారు పేర్కొన్నారు. లాక్డౌన్ నిబంధనలను కఠినతరం చేయడం కూడా ఒక కారణంగా చెప్పారు. కాగా  కరోనా ఫ్రీ అయినా సామాజిక దూరం పాటించాలని  ప్రజలను కోరారు.  అయినా కూడా మే 3 వరకు లాక్డౌన్ కొన‌సాగిస్తామ‌ని చెప్పుకొచ్చారు.logo