మాస్క్ ధరించనివారు కరోనా కేంద్రంలో సేవ చేయాలి: హైకోర్టు

అహ్మదాబాద్: మాస్క్ ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతూ పట్టుబడిన వారు కరోనా కేంద్రంలో సేవ చేయాలని గుజరాత్ హైకోర్టు తెలిపింది. కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారు కరోనా కేంద్రాల్లో నాలుగు నుంచి ఐదు గంటల పాటు సుమారు ఐదు నుంచి 15 రోజుల వరకు నాన్ మెడికల్ విధులు నిర్వహించాలని సూచించింది. క్లీనింగ్, హౌస్కీపింగ్, కుకింగ్, హెల్పింగ్, సర్వింగ్, రికార్డుల తయారీ, రికార్డులను భద్రపర్చడం వంటి పనులను మాస్కులు ధరించవారితో చేయించాలని పేర్కొంది. జరిమానా విధించడంతోపాటు వ్యక్తుల వయసు, విద్యార్హత, జండర్, హోదా ప్రకారం ఆయా సేవలు అప్పగించాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఒక విధానాన్ని రూపొందించి ఈ నెల 24న నివేదిక సమర్పించాలని ఆదేశించింది. విశాల్ అవతాపి అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం విచారణ జరిపిన గుజరాత్ హైకోర్టు ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- కొనసాగుతున్న పెట్రో బాదుడు.. రూ.93 దాటిన పెట్రోల్ ధర
- బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి తుది విడత కౌన్సెలింగ్
- మే 17 నుంచి పదో తరగతి పరీక్షలు?
- శ్రీమతికి మహేష్ బర్త్డే విషెస్.. పోస్ట్ వైరల్
- రేపు బెంగాల్, అసోంలో ప్రధాని పర్యటన
- ఈ ఫొటోలోని చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..!
- 20 తీర్మానాలను ఆమోదించిన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ
- బోల్తాపడిన ట్రాక్టర్.. 20 మంది కూలీలకు గాయాలు
- శివమొగ్గ ఘటనపై ప్రధాని సంతాపం