మంగళవారం 29 సెప్టెంబర్ 2020
National - Sep 17, 2020 , 12:04:10

ఈ ఏడాది జ‌మ్ముక‌శ్మీర్‌లో 177 మంది ఉగ్ర‌వాదుల హ‌తం

ఈ ఏడాది జ‌మ్ముక‌శ్మీర్‌లో 177 మంది ఉగ్ర‌వాదుల హ‌తం

శ్రీన‌గ‌ర్‌: జ‌మ్ముక‌శ్మీర్ కేంద్ర‌పాలిత ప్రాంతంగా మారిన త‌ర్వాత అక్క‌డ ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాల‌పై భ‌ద్ర‌త ద‌ళాలు, పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ప్ర‌తి రోజు ఏదో ఒకప్రాంతంలో ఉగ్ర‌వాదుల‌ను మ‌ట్టుపెడుతున్నారు. ఈ క్ర‌మంలో జ‌మ్ముక‌శ్మీర్‌లో ఈఏడాది ఆరంభం నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 177 మంది ముష్క‌రును అంత‌మొందించామ‌ని జ‌మ్ముక‌శ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ ప్ర‌క‌టించారు. గ‌త ఎనిమిది నెల‌ల్లో ఒక్క శ్రీన‌గ‌ర్ ప్రాంతంలో నిర్వ‌హించిన ఏడు ఆప‌రేష‌న్ల‌లో 16 మంది ఉగ్ర‌వాదులు హ‌త‌మ‌య్యార‌ని చెప్పారు. అదేవిధంగా ఈ ఏడాది రాష్ట్ర‌వ్యాప్తంగా 72 ఆప‌రేష‌న్లు నిర్వ‌హించామని చెప్పారు. 

ఈరోజు ఉద‌యం శ్రీన‌గ‌ర్‌లోని బాతామలూ ప్రాంతంలో ముగ్గురు ఉగ్ర‌వాదుల‌ను భ‌ద్ర‌తా ద‌ళాలు మ‌ట్టుబెట్టాయి. ఎన్‌కౌంట‌ర్‌లో ఓ సాధార‌ణ పౌరుడు చ‌నిపోగా, సీఆర్‌పీఎఫ్ డిప్యూటీ క‌మాండెంట్ తీవ్రంగా గాయ‌ప‌డ్డాడ‌ని వెల్ల‌డించారు. ఆయ‌న‌ను ఆర్మీ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించామ‌ని, ఇప్పుడు డాక్ట‌ర్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉన్నాడ‌ని చెప్పారు.   


logo