శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
National - Aug 15, 2020 , 19:27:16

వామ్మో ... ఈవిడేంటి 'టీ'ని ఇంత ఎత్తు నుంచి పోస్తుంది! స్పెష‌లిస్ట్‌లా ఉంది

వామ్మో ... ఈవిడేంటి 'టీ'ని ఇంత ఎత్తు నుంచి పోస్తుంది! స్పెష‌లిస్ట్‌లా ఉంది

వేడి వేడి టీని స్టై మీద నుంచి దించి క‌ప్పులో పోయ‌డానికి క్లాత్‌తో ప‌ట్టుకొని ఉఫ్.. ఉఫ్.. మంటూ ఊదుతూ పోస్తేనే అంతో కొంత కింద పోసే ఉంటాం. ఇంకాస్త అల‌వాటు ఉంటే కింద ప‌డ‌కుండా పోస్తాం. ఇలా ఎన్ని గ్లాసులు కింద ప‌డ‌కుండా పోయ‌గ‌లం. అది కూడా కొంచెం ఎత్తులో పెట్టి. ఒక‌టి రెండు క‌న్నా ఎక్కువ పోస్తే గోల్డ్ మెడ‌ల్ ఇవ్వాలంటారు. ఈ అమ్మాయిని చూస్తే నోరెళ్ల‌బెట్ట‌డం మాత్రం ఖాయం.

అవి వేడి వేడి టీ అనుకున్న‌దో చ‌ల్ల‌టి నీరు అనుకున్న‌దో తెలియ‌దు కానీ.. అమాంతం చేయి పొడ‌వున్నంత వ‌ర‌కు పైకి లేపి మ‌రీ మొర‌క్క‌న్ టీని క‌రెక్టుగా గ్లాసులో పోస్తున్న‌ది. పోసేట‌ప్పుడు ఏ మాత్రం త‌డ‌బాటు తొంద‌ర ఏం క‌నిపించ లేదు. సినిమాలో స్టైల్‌గా హీరో ఫోజ్ కొడుతున్న‌ట్లు ఉంది ఆమె స్టిల్‌. కానీ ఇది రియ‌ల్‌. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్న‌ది. ఈ ప్రొఫెష‌న్‌‌లో ఈమెకు ఎంత అనుభ‌వం ఉందో కాని అద‌ర‌గొట్టేసింది. ఆమె చేసింది క‌దా అని మీరు ఇంట్లో ట్రై చేయ‌కుండి. చేతులు కాల్చుకుంటారు. 

 


logo