బుధవారం 02 డిసెంబర్ 2020
National - Sep 16, 2020 , 18:54:28

'కాగితం సొరంగం'లోకి దూరి పిల్లి తిప్ప‌లు.. ఎంత క‌ష్ట‌ప‌డిందో!

'కాగితం సొరంగం'లోకి దూరి పిల్లి తిప్ప‌లు.. ఎంత క‌ష్ట‌ప‌డిందో!

పిల్లి కాసేపు కూడా కామ్‌గా ఉండ‌దు. కంటికి క‌నిపించిన దాన్ని కాళ్ల‌తో గిల్లుతూనే ఉంటుంది. ప‌రిశోధ‌కులు రీసెర్చ్ చేసిన‌ట్లుగా చేసి చివ‌రికి దాంట్లో ఇరుక్కోవ‌డం మాత్రం ఖాయం. అలా ఓ పిల్లి గుండ్రంగా ఉన్న అట్ట‌ముక్క‌తో ఆడుకుంటున్న‌ది. దాన్ని కింద‌ప‌డేసే స‌రికి సొరంగంలా క‌నిపించింది. దాంట్లో దూరి ఆడుకుందాం అనుకున్న‌ది కోబోలు. చిన్న‌గా సొరంగంలోకి దూరింది.

కాగితం అయ్యేసిరికి పిల్లికి అతుక్కుపోయింది. దీంతో పిల్లి బ‌య‌ట‌కు రావ‌డానికి కాస్త టైం ప‌ట్టింది. బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత హ‌మ్మ‌య్యా ఎలాగోలా బ‌య‌ట ప‌డ్డాంలే అని ఊపిరిపీల్చుకున్న‌ది. ఈ వీడియోను 'వెల్‌క‌మ్ టు నేచ‌ర్' ట్విట‌ర్‌లో షేర్ చేసింది. పిల్లి వీడియోలు ఎప్పుడూ అందంగానే ఉంటాయి. అందుకే ఆన్‌లైన్‌లోకి వ‌చ్చిన కాసేప‌టికే వైర‌ల్ అయింది. దీనిని ఇప్ప‌టివ‌ర‌కు 33 వేలమంది వీక్షించారు.