శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
National - Aug 07, 2020 , 20:43:45

త‌ల్లి నిద్ర‌కు భంగం క‌లిగించ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్న సింహం పిల్ల‌! ఎంత‌కీ లేవ‌క‌పోయేస‌రికీ..

త‌ల్లి నిద్ర‌కు భంగం క‌లిగించ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్న సింహం పిల్ల‌! ఎంత‌కీ లేవ‌క‌పోయేస‌రికీ..

పిల్ల‌లు ఎంత స‌ర‌దాగా ఆడుకుంటున్నా ప‌క్క‌న ఎవ‌రైనా నిద్ర‌పోతుంటే అస‌లు ఒప్పుకోరు. వారు కూడా త‌మ‌తో ఆడాల‌ని మారాం చేస్తుంటారు. ఇలా ఒక సింహం పిల్ల కూడా అలానే చేసింది. తోటి పిల్ల‌ల‌తో ఆడుకుంటూ సింహం పిల్ల బిబీగా ఉన్న‌ది. అబ్బా.. ఈలోపు ఓ నిద్ర వేద్దామ‌ని అలా రోడ్డు మీద ప‌డుకొని కునుకు తీస్తున్న‌దో త‌ల్లి సింహం. త‌ల్లి నిద్ర‌పోవ‌డం చూసి ఎలాగైనా డిస్ట్ర‌బ్ చేద్దామ‌నుకున్న‌ది. ఈ వీడియోను వెల్‌క‌మ్ టు నేచ‌ర్ ట్విట‌ర్‌లో షేర్ చేశారు.

ప‌డుకోనున్న సింహం మీద‌కి అమాంతం దూకి నాతో పాటు ఆడుకోవాలంటూ డిస్ట్ర‌బ్ చేస్తున్న‌ది. అయినా సింహం లేవ‌లేదు. త‌న ప్ర‌య‌త్నం తాను చేస్తూనే ఉన్న‌ది. ఈ వీడియో నెటిజ‌న్ల‌ను బాగా ఆక‌ట్టుకుంటున్న‌ది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇప్ప‌టివ‌ర‌కు దీనిని 21.8 కే మంది వీక్షించారు. ఇది చాలా అంద‌మైన‌ది అని ఒక నెటిజ‌న్ కామెంట్ పెట్టారు. 


logo