మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 31, 2020 , 12:25:14

చేతివేళ్ళ‌తో ఆడుకుంటున్న గెలాగో జంతువు.. అంద‌రినీ న‌వ్విస్తున్న వీడియో!

చేతివేళ్ళ‌తో ఆడుకుంటున్న గెలాగో జంతువు.. అంద‌రినీ న‌వ్విస్తున్న వీడియో!

ప్ర‌తి ఉద‌యం ఆనందంగా, సంతోషంగా మొద‌ల‌వ్వాలంటే ఈ వీడియో చూస్తే చాలు. ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ ఆఫీస‌ర్ ప‌ర్వీన్ క‌స్వాన్ ఈ వీడియోను ట్విట‌ర్‌లో షేర్ చేశారు. ఇవి రాత్రి పూట ఎక్కువ‌గా తిరుగుతుంటారు. వీటిని నాగ‌పీస్ లేదా నైట్ కోతులు అని అంటారు. ఈ జంతువుతో ఒక వ్య‌క్తి ఆడుకుంటూ క‌నిపించాడు. చిన్న‌పిల్ల‌లు చేతివేళ్ల‌తో ఎలా అయితే ఆడుకుంటారో ఇది కూడా అలానే ఆడుకుంటుంది.

'గెలాగోని బుష్ బేబీ అని కూడా పిలుస్తారు. ఇది కేవ‌లం 6 అంగుళాల వ‌ర‌కు పెరుగుతుంది. రాత్రిపూట ప్రైమేట్లు ఆఫ్రికాలో క‌నిపిస్తాయి. రాబోయే ఏడాదిలో ఈ జాతుల సంఖ్య ఎక్కువ‌వుతాయ‌ని అంటున్నారు' అనే శీర్షిక‌తో జోడించారు. ఈ వీడియో నెట్టింట్లో వైర‌ల్‌గా మారింది. గాల‌గోస్ పెద్ద క‌ళ్ళు ఉండ‌డంతోపాటు అవ‌య‌వాలు గ‌ట్టిగా ఉంటాయి. వీటిని పొడ‌వైన తోక ఉంటుంది. చెవులు బ్యాట్ ఆకారంలో ఉంటాయి. 

  


logo