గురువారం 09 జూలై 2020
National - Jun 29, 2020 , 15:00:48

జ‌ల‌కాలాడుతున్న పిల్ల‌ ఏనుగు.. ప్రోత్స‌హిస్తున్న త‌ల్లి!

జ‌ల‌కాలాడుతున్న పిల్ల‌ ఏనుగు.. ప్రోత్స‌హిస్తున్న త‌ల్లి!

శ‌నివారం, ఆదివారం రెండు రోజులు వీక్ఆఫ్ మూడ్‌లో ఉంటారు. సోమ‌వారం వ‌చ్చేస‌రికి ఎక్క‌డాలేని బ‌ద్ధ‌కం వ‌చ్చేస్తుంది. ఆఫీస్‌కు వెళ్లి వ‌ర్క్ చేయాలంటే.. ఏడుపు ఒక్క‌టే త‌క్కువ‌వుతుంది. ఈ రోజు అంద‌రి మూడ్‌ను మార్చేయ‌డానికి ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ అధికారి ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఇందుల్లో పిల్ల ఏనుగు ట‌ట్ బాత్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న‌ది.

త‌ల్లి ఏనుగు స‌మ‌క్షంలో పిల్ల ఏనుగు స్నానం చేస్తున్న వీడియో సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ అయింది. 34 సెకండ్ల‌పాటు న‌డిచే ఈ వీడియోను 25,000 మంది వీక్షించారు. 3 వేల‌కు పైగా లైక్స్ సంపాదించుకున్న‌ది. ఇలాంటి వీడియోల‌ను పోస్ట్ చేస్తున్నందుకు నందాకు నెటిజ‌న్లు  కృతజ్ఞతలు తెలిపారు.

 

   


logo