శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 06, 2020 , 15:43:53

ఆనందం అంటే ఇదే: ఆనంద్ మ‌హీంద్రా

 ఆనందం అంటే ఇదే: ఆనంద్ మ‌హీంద్రా

లాక్‌డౌన్ కార‌ణంగా అంద‌రూ వర్క్‌ఫ్ర‌మ్‌హోమ్ చేస్తున్నారు. వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా మీటింగుల‌కు హాజ‌ర‌వుతున్నారు. ఇలా హాజ‌రు కావాలంటే ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త ఆనంద్ మ‌హీంద్రాకు అస‌లు ఇష్టం ఉండ‌దు. సోమ‌వారం అయితే మ‌రీ ఎక్కువ‌గా ఉంటుంది. త‌న‌తోపాటు అంద‌రి శాడ్‌మూడ్‌ను యాక్టివ్‌గా మార్చేయ‌డానికి ఆనంద్ మ‌హీంద్ర స‌రికొత్త వీడియోను ట్విట‌ర్‌లో పోస్ట్ చేశారు.

ఇందులో ఓ గ్రామానికి చెందిన పిల్ల‌లు చెరువులో ఈత కొట్టే విధానం అంద‌రినీ ఉత్సాహ‌ప‌రుస్తుంది. ఎలాంటి క‌ల్మ‌షం లేకుండా లాక్‌డౌన్‌లో కూడా ఎంత ఆనందంగా ఉన్నారో ఈ పిల్ల‌లు. పైగా మ‌ట్టికొండ‌పై నుంచి అలా జారుతుంటే వారి ముఖంలోని హావ‌భావాలు మ‌న‌సుకి హాయినిస్తుంది. ఈ వీడియోను నాంది ఫౌండేష‌న్ సీఈఓ మ‌నోజ్ కుమార్ ట్విట‌ర్‌లో షేర్ చేస్తే దానికి ఆనంద్ మ‌హీంద్రా 'సోమ‌వారం ప్రేర‌ణ' అంటూ రీట్వీట్ చేశారు. 'క‌రోనా అనంత‌రం మ‌న‌మంద‌రం ప్ర‌తీ ఆనందానికి ఎక్కువ విలువ‌నిస్తాం. ఈ వీడియో సోమ‌వారం మూడ్‌ను మార్చేస్తుంది'. అనే క్యాప్ష‌న్‌తో ఆనంద్ షేర్ చేశారు. ఈ వీడియోను 86 వేలమంది వీక్షించారు. 

 


logo