శనివారం 04 జూలై 2020
National - Jun 17, 2020 , 20:59:04

బిడ్డ‌ను కంటికి రెప్ప‌లా కాపాడుకుంటున్న గ‌జేంద్రుడు

బిడ్డ‌ను కంటికి రెప్ప‌లా కాపాడుకుంటున్న గ‌జేంద్రుడు

క‌డుపులో ఉన్న‌ప్పుడే బాంబు పెట్టి మ‌రీ చంపేశారు. ఇప్పుడు భూమి మీద ఉంటే చంప‌డానికి వెనుకాడ‌రా అనుకున్న‌దో ఏమో ఈ త‌ల్లి ఏనుగు. క‌న్న‌బిడ్డ‌పై మ‌నిషి క‌న్ను ప‌డ‌కుండా ఎలా కాపాడుకుంటుందో చూడండి. 16 సెకండ్ల‌పాటు న‌డిచే ఈ వీడియోను ప‌ర్వీన్ క‌శ్వాన్ ట్విట‌ర్‌లో షేర్ చేశాడు. ఇప్పుడు ఈ వీడియో వైర‌ల్‌గా మారింది.

ఏనుగు న‌డుస్తున్న‌ప్పుడు పిల్ల ఏనుగు త‌ల్లి కింద న‌డుస్తున్న‌ది. నాలుగు దిక్కులలో ఏ వైపు నుంచి ఏ ఆప‌ద వ‌స్తుందో అని జాగ్ర‌త్త ప‌డుతున్న‌ది. ఈ వీడియోను ఇండియ‌న్ ఫారెస్ట్ అధికారి ప‌ర్వీన్ క‌శ్వాన్ 'త‌ల్లులు త‌మ పిల్ల‌ల‌ను ఎలా కాపాడుకుంటాయో చూడొచ్చు' అనే శీర్షిక‌తో వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోకు 900 రీట్వీట్లు, 5 వేల‌కు పైగా లైకులు సాధించింది.logo