ఆదివారం 27 సెప్టెంబర్ 2020
National - Aug 09, 2020 , 16:52:22

ఆన్‌లైన్‌ క్లాస్‌కు రిఫ్రిజిరేటర్‌ ట్రే ఊతం.. టీచర్‌ ఐడియా వినూత్నం..!

ఆన్‌లైన్‌ క్లాస్‌కు రిఫ్రిజిరేటర్‌ ట్రే ఊతం.. టీచర్‌ ఐడియా వినూత్నం..!

హైదరాబాద్‌: కరోనా మహమ్మారి విద్యను వర్చువల్‌ తరగతి గదులకు మార్చింది.  ఆన్‌లైన్ బోధన ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఉత్తమ ఎంపిక అయినప్పటికీ, ఇది సవాళ్లతో కూడుకున్నది. చాలా మంది విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఆన్‌లైన్ తరగతులు అంత సులభం కాదు. అయితే, ఓ ఉపాధ్యాయురాలు వినూత్నంగా ఆలోచించి, ఆమెకు అందుబాటులో ఉన్న వనరును ఉత్తమంగా ఉపయోగించుకుని అందరి ప్రశంసలూ పొందింది. 

ఓ మహిళా టీచర్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులు చెప్పేందుకు ఓ రిఫ్రిజిరేటర్‌ ట్రేను ఉపయోగించింది. పారదర్శకంగా ఉండే ట్రేను రెండు డబ్బాలపై ఉంచింది. దానిపైన ఫోన్‌ను పెట్టి కింద సమస్యను సాల్వ్‌ చేస్తూ విద్యార్థులకు వివరించింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. నెటిజన్లు ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు. ఉద్యోగం పట్ల అంకితభావం ఉన్నవారు ఏదైనా చేస్తారంటూ కామెంట్‌ చేశారు. ఆమెకు సలాం అంటూ అభినందించారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo