బుధవారం 30 సెప్టెంబర్ 2020
National - Sep 16, 2020 , 12:41:15

జొమాటో డెలివ‌రీ మ‌హిళ‌కు 'డైమండ్ స్టార్ అవార్డు'

జొమాటో డెలివ‌రీ మ‌హిళ‌కు 'డైమండ్ స్టార్ అవార్డు'

లాక్‌డౌన్‌కు ముందు, త‌ర్వాత‌ ఫుడ్ డెలివ‌రీకి కొదువే లేదు. ఈ ఫీల్డ్‌లో ఎక్కువ‌గా పురుషులే ఉంటారు. మ‌హిళ‌లు చాలా అరుదుగా క‌నిపిస్తారు. మ‌హిళ‌లు ఈ వృత్తిలోకి రావాలంటే బ‌ల‌మైన కార‌ణ‌మే ఉంటుంది. డెలివ‌రీ ఉమెన్‌గా ప‌నిచేస్తున్న ఉమా 10 ఏండ్ల క్రితం భ‌ర్త‌ను కోల్పోయి కుటుంబ బారాన్ని మోస్తున్న‌ది. ఉద్యోగం ప‌రంగా ప్ర‌తిరోజూ త‌న బైక్ మీద 250-300 కి.మీ. దూరం ప్ర‌యాణిస్తుంది. ఇక‌పోతే ఈమె పేరు మీద ఇప్ప‌టివ‌ర‌కు ఆల‌స్యంగా ఫుడ్ డెలివ‌రీ చేసినట్లు, మ‌రే ఇత‌ర కంప్లైంట్స్ లేవు.

ఉమా ప‌నిత‌నం న‌చ్చి సుకృతి అనే యూజ‌ర్ ఈమె గురించి ట్విట‌ర్‌లో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ కాస్త వైర‌ల్ అవ‌డంతో జోమాటో ఆమ‌ను ప్ర‌శంసించింది. నిజజీవిత హీరోను పంచుకున్నందుకు గ‌ర్వంగా ఉంది. శ్రీ‌మ‌తి ఉమాకు ఎక్స్‌లెన్స్ కోసం డైమండ్ స్టార్ అవార్డు ల‌భించింది. ఎందుకంటే ఆమె ఇప్ప‌టివ‌ర‌కు లేట్ డెలివ‌రీ చేయ‌లేదు. కుటుంబ బారం మోస్తూ కొడుకును గ‌ర్వంగా చూసుకుంటుంది అని ట్వీట్ చేశారు. ఉమా మీరు మా సంస్థ‌లో ప‌నిచేస్తుందుకు చాలా గ‌ర్వంగా ఉంది అని మైక్రోబ్లాగింగ్ సైట్‌లో రెస్టారెంట్ అగ్గ‌రిగేట‌ర్ పేర్కొన్నారు. ఎంతోమందికి ఉమా ఇప్పుడు ఆద‌ర్శంగా మారింది. 


logo