సోమవారం 26 అక్టోబర్ 2020
National - Sep 21, 2020 , 14:50:23

నోటితో క‌ర్ర ప‌ట్టుకొని సామాజిక దూరం పాటిస్తున్న కుక్కపిల్ల‌.. అడ్డొచ్చినోళ్ల‌ను!

నోటితో క‌ర్ర ప‌ట్టుకొని సామాజిక దూరం పాటిస్తున్న కుక్కపిల్ల‌.. అడ్డొచ్చినోళ్ల‌ను!

క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో సామాజిక దూరం పాటించ‌మ‌ని మ‌నుషుల‌కు చెప్పి చెప్పి నోరు పోవాల్సిందే కాని ఒక‌రు కూడా పాటించ‌డం లేదు. క‌నీసం ఈ కుక్క‌పిల్ల‌కు చెప్పి ఉంటే మాట అయినా నిలిచుండేది. రోడ్డు మీద గుంపులు గుంపులుగా వెళ్తున్న వారితో న‌డిస్తే త‌న‌కి ఎక్క‌డ క‌రోనా వ‌స్తుందో అని చాలా జాగ్ర‌త్త‌గా దూరంగా న‌డిచిందో కుక్క‌పిల్ల‌. కుక్క దూరం వెళ్లినా మ‌నుషులు ద‌గ్గ‌ర‌కు వ‌స్తార‌ని నోటితో క‌ర్ర‌ను అడ్డంగా ప‌ట్టుకొని న‌డిచింది. మ‌నుషులు ఎవ‌రైనా ఎదు‌రొస్తే ఈ క‌ర్ర వారిని దూరం జ‌రిగేలా చేస్తుంది. ఇంత చ‌క్క‌టి ఉపాయం ఫాలో అవుతున్న కుక్క‌పిల్ల వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది.

34 సెకండ్ల‌పాటు న‌డిచే ఈ వీడియోను 'వెల్‌క‌మ్ టు నేచ‌ర్' అనే ఖాతా ట్విట‌ర్‌లో షేర్ చేసింది. 'ప‌ప్పీ సామాజిక దూరాన్ని చాలా సీరియ‌స్‌గా తీసుకుంది' అనే శీర్షిక‌ను జోడించారు. ఇంత అంద‌మైన క్లిప్‌ను ఇప్ప‌టివ‌ర‌కు 131.8కే మంది వీక్షించారు. 'సో క్యూట్. మంచి ప‌ని చేస్తుంది' అని ఒక‌రు కామెంట్ చేస్తే 'ప‌ప్పీ చాలా తెలివైన‌ది' అని మ‌రొక‌రు కామెంట్ చేశారు. 


logo