మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 07, 2020 , 10:10:05

పంజాబ్‌ వెళ్లాలంటే ఈ పాస్ తప్పనిసరి

పంజాబ్‌ వెళ్లాలంటే ఈ పాస్ తప్పనిసరి

చండీగఢ్ : కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తీవ్రత తక్కువగా ఉన్న రాష్ట్రాలు కొంచెం జాగ్రత్త పడుతున్నాయి. ఎందుకంటే ఒక్కసారి ఈ వైరస్  తీవ్రరూపం దాల్చితే దానికి అడ్డుకట్ట వేయడం సామాన్య విషయం కాదని గుర్తించాయి. ఈ పరిస్థితుల్లో వీలైనంతవరకు వైరస్ సోకని వారిని రాష్ట్రాల్లోకి అనుమతిస్తే కొంతమేర ఇబ్బంది నుంచి గట్టెక్కవచ్చని భావిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఏపీలోకి వచ్చే వారికి పాస్ ఉంటేనే అనుమతి ఎలా కొనసాగుతుందో.. తాజాగా పంజాబ్ సైతం ఇదే విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ పాస్ తీసుకోవాలని, అదేవిధంగా హోం క్వారెంటైన్‌లో ఉండాలని నిబంధనలు విధించింది.

ఈ నిబంధన వెంటనే అమల్లోకి వస్తుందని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ వెబ్‌సైట్‌లో కానీ, కోవా పంజాబ్ అనే మొబైల్ అప్లికేషన్‌లో కానీ రిజిస్ట్రేషన్ చేసుకుని, దానికి సంబంధించిన కాపీని వెంట తీసుకురావాలని సూచించింది. ఈ-రిజిస్ట్రేషన్ చేసుకుని రాష్ట్రంలోకి వచ్చినప్పటికీ వారంతా కచ్చితంగా 14 రోజుల పాటు హోం క్వారంటైన్ ఉండాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo