గురువారం 29 అక్టోబర్ 2020
National - Sep 27, 2020 , 19:31:54

ఈ పెయింటింగ్‌లో ఉన్న సందేశం తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు!

ఈ పెయింటింగ్‌లో ఉన్న సందేశం తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు!

ఒక కుండను వివిధ మార్గాల్లో మోస్తూ ముగ్గురు మహిళలు ఉన్న ఈ పెయింటింగ్ గొప్ప సందేశాన్నిస్తుంది. సుశాంత‌ నందా పంచుకున్న ఈ పెయింటింగ్‌లోని సందేశం నిజంగా చాలా శక్తివంతమైంది. ఈ ప్రత్యేకమైన కళాకృతిలో ముగ్గురు మహిళలు చీరలు ధరించారు. చూడ‌గానే ఏ చిత్రం అర్థం కాదు. కాస్త నిదానంగా పెయింటింగ్‌ను గ‌మ‌నిస్తే అర్థ‌మ‌వుతుంది.

"పెయింటింగ్‌లో ముగ్గురు స్త్రీలు ఒకే కుండను ఎవ‌రికివారు మోస్తున్నట్లు వర్ణిస్తుంది. ప్రతి స్త్రీ తన బాధ్యతను భిన్నంగా నిర్వహిస్తుంది. ఒక‌రితో ఒక‌రిని పోల్చవద్దు' అనే శీర్షికను‌ నందా జోడించారు. ఈ చిత్రాన్ని "మీలో ఎంతమంది అంగీకరిస్తున్నారు'‌ అనే ప్ర‌శ్న‌ను కూడా వ‌దిలారు. ఈ పెయింటింగ్ నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకున్న‌ది. "ఇది ఒక అద్భుతమైన కళ. ఒకరి  బాధ్యతలను వ‌ర్ణించ‌డానికి సులభమైన మార్గం" అని ఒక వినియోగదారు కామెంట్ చేశారు.