ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 18, 2020 , 13:15:52

ఆ కోతి సైన్స్ స్టూడెంట్‌.. మ‌నిషిగా పుట్టి ఉంటేనా..

ఆ కోతి సైన్స్ స్టూడెంట్‌.. మ‌నిషిగా పుట్టి ఉంటేనా..

కోతుల నుంచే మ‌నిషి వ‌చ్చాడ‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. కానీ మ‌నిషికి ఉన్న తెలివితేట‌ల‌న్నీ ఈ కోతికి ఉండ‌డం గ‌మ‌నార్హం. ఈ కోతిని చూసిన‌ప‌పుడు ఇది కోతిగా క‌న్నా మ‌నిషిగా పుట్టి ఉంటే ఇప్ప‌టివ‌ర‌కు ఎన్నో కనిపెట్టి ఉండేది అనుకుంటున్నారు. దీని బుర్ర అంత చురుగ్గా ప‌నిచేస్తుంది.

ఈ కోతి ఎత్తైన గోడను ఎక్కేందుకు ఒక ట‌క్క‌రి ప్లాన్ వేసింది. ప‌క్క‌న ఎమైనా చిన్న చెట్లు ఉన్నాయోమో అని చూసింది. అనుకున్న విధంగానే ఒక చెట్టు ఉంది. కాని అది గోడ‌కు ద‌గ్గ‌ర్లో లేదు. అందుక‌ని మ‌నిషి అలోచించిన‌ట్లే ఆలోచించింది. అదేంటంటే.. చెట్టు చిటారు కొమ్మ‌న ఎక్కి కొమ్మ‌ను అటూ ఇటూ ఊపిరి. ఆ ఫోర్స్‌లోనే జంప్ చేసి గోడ మీద‌కు ఎగిరి దూకేసింది. అంతే.. ప‌క్కింటి పిట్ట‌గోడ‌ను అందుకొని తాపీగా న‌డుచుకుంటూ వెళ్లింది. ఈ కోతి ఐడియా భ‌లే ఉంది క‌దూ. మ‌నుషుల‌కే ఈర్ష్య పుట్టించే విధంగా ఉంది. 


logo