శనివారం 30 మే 2020
National - May 07, 2020 , 15:00:52

నవ్వు తెప్పించిన ఏటీఎం దోపిడీ కథ

నవ్వు తెప్పించిన ఏటీఎం దోపిడీ కథ

హైదరాబాద్: ఓ ఏటీఎం దొంగతనం వీడియో నెట్‌లో వైరల్ అయింది. చాలామంది అది చూసి నవ్వుకున్నారు కూడా. అందులో నవ్వేందుకు ఏముంది అంటే.. నేరానికి పాల్పడిన దొంగ ఓ కోతి. ఢిల్లీ సౌత్ ఎవెన్యూ ప్రాంతంలోని ఏటీఎంలో ఈ ఘటన జరిగింది. ఏటీఎంలో దూరిన కోతి ముందుగా దాని ప్యానెల్‌ను పీకింది. దానికి కావాల్సింది ఏమిటో మనకు తెలియదు. కానీ లోపల అంతా కలియజూసి అది వెళ్లిపోయింది. ఏఎన్ఐ వార్తా సంస్థ ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసింది. 40 వేల వ్యూలు వచ్చాయి. అవి ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. నెటిజన్లు కోతి ఏటీఎం దోపిడీపై జోకులు వేసుకుంటున్నారు.


logo