బుధవారం 27 మే 2020
National - May 11, 2020 , 20:00:21

ఈ పార్కింగ్ ఏదో భ‌లే ఉందే! ఆనంద్ ట్వీట్‌

ఈ పార్కింగ్ ఏదో భ‌లే ఉందే! ఆనంద్ ట్వీట్‌

ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌, మ‌హీంద్ర గ్రూప్ చైర్మ‌న్ ఆనంద్ మ‌హీంద్రా ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉంటారు. ఆశ్చ‌ర్యానికి గురి చేసే వీడియోల‌ను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ అభిమానుల‌కు ద‌గ్గ‌ర‌గా ఉంటారు. ఇటీవ‌ల రెండు చ‌క్రాల‌తో ట్రాక్ట‌ర్ న‌డిపిన వ్య‌క్తిని ప్ర‌మాదం గురించి ఒకవైపు హెచ్చ‌రిస్తూనే మ‌రోవైపు మెచ్చుకున్నారు. ఇప్పుడు అలాంటి వీడియోనే మ‌హీంద్రా కంట ప‌డింది.

ఇంటి వ‌ద్ద కార్ పార్కింగ్‌కు ప్ర‌దేశం లేక‌పోవ‌డంతో ఇంటి మెట్ల కింద ఉన్న త‌క్కువ ప్ర‌దేశంలోనే కార్‌ను ప‌ట్టించాడు. ఈ పార్కింగ్‌కు పెద్ద‌గా క‌ష్ట‌ప‌డాల్సిన అవ‌స‌రం కూడా లేదు. దీనికో టెక్నిక్ క‌నుగొన్నాడు. ఆ ఐడియానే మ‌హీంద్రాకు తెగ న‌చ్చేసింది. ఈ వీడియోను చూసేందుకు ప్ర‌జ‌లు తెగ ఆరాట‌ప‌డుతున్నారు. 


logo