సోమవారం 13 జూలై 2020
National - Jun 27, 2020 , 17:03:40

భార్య మీద కోపంతో ఏం చేశాడో చూడండి.. నిజంగా ఇలా చేస్తే ఇంకేమైనానా?

భార్య మీద కోపంతో ఏం చేశాడో చూడండి.. నిజంగా ఇలా చేస్తే ఇంకేమైనానా?

భార్యాభ‌ర్త‌లు అన్నాక స‌వాల‌క్ష గొడ‌వ‌లు ఉంటాయి. అవ‌న్నీ మ‌న‌సులో పెట్టుకుంటే సంసారం న‌డ‌వ‌దు. ఎప్పుడివి అప్పుడ మ‌ర్చిపోతూ ఉండాలి. అందుకే జీవితం అంటేనే స‌ర్దుకుపోవ‌డం అంటారు పెద్ద‌లు. మ‌రి భార్య మీద భ‌ర్త‌కి కోపం. భ‌ర్త మీద భార్య‌కు కోపం రాదా. ఇంత‌కు ముందు జ‌రిగిన విష‌యాలు ఏవీ గుర్తుండ‌వా? వ‌చ్చిన‌ప్పుడ ఏం చేయాలి. ఎలా రివేంజ్ తీర్చుకోవాలి. భార్య‌కు తెలిస్తే బ‌త‌క‌నిస్తుందా అనుకునే భ‌ర్త‌ల‌కు ఈ వీడియో బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇది స‌ర‌దా కోసం చేసిన వీడియో అయిన‌ప్ప‌టికీ చాలామంది మ‌గ‌వాళ్లు ఈ వీడియో చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

భార్య ఇంటిని శుభ్రంగా ఉంచే ప‌నిలో నిమ‌గ్న‌మై ఉన్న‌ప్పుడు వెనుక నుంచి భ‌ర్త ఒక ట‌వ‌ల్‌ను ఆమె ముఖంపై క‌ప్పి చిత‌క‌బాదుతాడు. తీరా ఆమె క‌ళ్లు తెరిచేస‌రికి అత‌ను కూడా కింద ప‌డి దొర్లుతుంటాడు. అత‌ని ముఖంపైన కూడా ఒక ముసుగు వేస్కొని న‌న్ను కూడా ఎవ‌రో కొట్టారు అని భార్య ద‌గ్గ‌ర యాక్ట్ చేస్తాడు. పాపం పిచ్చి భార్య నిజ‌మే అనుకొని ఇంట్లోకి ఎవ‌రు వ‌చ్చార‌ని త‌లుపు తెరిచి చూస్తుంది ఎవ‌రూ క‌నిపించ‌క‌పోవ‌డంతో ఏమోలే అన్న‌ట్లు వ‌దిలేస్తుంది. ఇద‌న్నమాట వీడియో సారాంశం. టిక్‌టాక్‌లో  ఈ వీడియో చూస్తూ 'భ‌లే ఐడియా క‌దూ' అంటూ న‌వ్వుకుంటున్నారు. 


logo