ఆదివారం 27 సెప్టెంబర్ 2020
National - Aug 10, 2020 , 13:37:32

సింహాలు ద‌ర్జాగా న‌డిచొస్తుంటే.... ఇలా ఉంటుంది!

సింహాలు ద‌ర్జాగా న‌డిచొస్తుంటే.... ఇలా ఉంటుంది!

వ‌న్య‌ప్రాణులు సోష‌ల్ మీడియా మీద దాడి చేసిన‌ట్లున్నాయి. మ‌నుషుల క‌న్నా వీటి హ‌డావుడే ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ ఆఫీస‌ర్ ప‌ర్వీన్ క‌స్వాన్ షేర్ చేసిన ఈ వీడియోలో సింహాలు అలా న‌డిచొస్తుంటే క‌ల్లు తిప్పుకోబుద్ది కాదు. ఈ వీడియో ప్ర‌తిఒక్క‌రికీ ఆనందం క‌లిగిస్తుంది.

ఒక అడ‌విలో సింహాల గుంపు న‌ది వైపు న‌డుచుకుంటూ వ‌స్తున్నాయి. ఒడ్డున ఆగి నీరు తాగుతున్న ఈ వీడియోను ప‌ర్వీన్ క‌స్వాన్ షేర్ చేయ‌గా వైర‌ల్‌గా మారింది. 'ఇంత అంద‌మైన సింహాల గుంపును ఎప్పుడైనా చూశారా' అనే క్యాప్ష‌న్‌ను జోడించారు. ఈ వీడియోను ల‌క్షా 98 వేలు మంది వీక్షించ‌డం గ‌మ‌నార్హం. 'వావ్ ఎంత అందం.. తీరిక స‌మ‌యంలో బ్ర‌హ్మ దేవుడు వీటిని సృష్టించి ఉంటాడు' అంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. 


logo