సోమవారం 01 జూన్ 2020
National - May 19, 2020 , 15:02:07

ఆమె నిజంగా స్ఫూర్తిదాయకం!

ఆమె నిజంగా స్ఫూర్తిదాయకం!


కొవిడ్‌-19కు ఎక్కువగా బలవుతున్న రాష్ర్టాల్లో మహారాష్ట్ర ఒకటి. దీనిని నియంత్రణ చేయడానికి అధికారులు ఎన్నో చర్యలు తీసుకుంటారు. అయినప్పటికీ మురికివాడల ప్రజలు దానిని అమలు చేయడం లేదు. కారణం వారికి కొవిడ్‌-19 వైరస్‌ పట్ల అవగాహన లేకపోవడమే. దీనికి చెక్‌ పెట్టేందుకు సునీతా నాగ్‌కీర్తి ఓ పతకం వేసింది. చిన్నపిల్లలకు పరిశుభ్రత గురించి అవగాహన కల్పించాలనుకున్నది. 

కొన్ని విషయాలు పాఠాలుగా కంటే పాటల రూపంలో పాడి చెబితేనే అర్థమవుతుంది అనుకున్నది. అందుకే స్లమ్‌ ఏరియాలోని పిల్లలందరినీ సామాజిక దూరం పాటిస్తూ కూర్చోబెట్టి రైమ్స్‌ పాడిస్తున్నది టీచర్‌. చిట్టి చిలకమ్మ బదులు చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడప్పుడు శానిటైజర్‌ వాడుతూ ఉండాలి. మాస్కులు ధరించాలి. సామాజిక దూరం పాటించాలి అన్న విషయాలను రైమ్స్‌ ద్వారా పిల్లలకు నేర్పిస్తున్నది. కరోనాను అరికట్టేందుకు ప్రయత్నాలు చేపడుతున్న వారిలో సునీతా కూడా ఒక భాగం అంటూ స్పోర్ట్స్‌ కమిషనర్‌ ఓం ప్రకాష్‌ బకోరియా, సునీతా రైమ్స్‌ క్లాస్‌ వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. 20 సెకండ్లపాటు ఉన్న ఈ వీడియోకు మంచి ఆదరణ లభించింది. logo