e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home News హెయిర్‌క‌ట్ చేస్తుంటే బుడ్డోడి ఏబీసీడీ సాంగ్‌.. వైర‌ల్ వీడియో

హెయిర్‌క‌ట్ చేస్తుంటే బుడ్డోడి ఏబీసీడీ సాంగ్‌.. వైర‌ల్ వీడియో

హెయిర్‌క‌ట్ చేస్తుంటే బుడ్డోడి ఏబీసీడీ సాంగ్‌.. వైర‌ల్ వీడియో

న్యూఢిల్లీ: చిన్న పిల్ల‌లు చూడ‌గానే ముద్దొస్తారు. వారి పాల బుగ్గ‌లు, బోసి న‌వ్వులను చూస్తుంటే ఎంత సేపు ముద్దాడినా త‌నివి తీర‌దు. ఇక వాళ్లు చేసే అల్ల‌రి ప‌నులు ఒక్కోసారి విసుగు పుట్టించినా, ఒక్కోసారి మాత్రం తెగ న‌వ్వు తెప్పిస్తాయి. ఒక్కోసారి వాళ్లు మ‌న అంచనాల‌కు అంద‌ని విధంగా ప్ర‌వ‌ర్తిస్తూ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తారు. ఔరా..! అంటూ ముక్కున వేలేసుకునేలా చేస్తారు. ఈ కింది వీడియోలో కూడా ఓ బుడ్డోడు పాట పాడిన తీరు ఔరా..! అనిపించ‌క మాన‌దు.

ఇంత‌కే ఆ వీడియోలో ఏముందంటే.. ఎర్ర రంగు కుర్చీలో కూర్చున్న ఓ బుడ్డోడికి బార్బ‌ర్ హెయిర్‌క‌ట్ చేస్తుంటాడు. క‌రోనా టైమ్ కావ‌డంతో ఆ బుడ్డోడి పేరెంట్స్‌ బార్బ‌ర్‌ను ఇంటికే పిలిపించి క‌టింగ్ చేయిస్తున్న‌ట్లుగా వీడియోలోని దృశ్యాల‌ను బ‌ట్టి చూస్తే తెలుస్తున్న‌ది. అయితే, బార్బ‌ర్ చేతిలో క‌త్తులు చూసి బాలుడు భ‌య‌ప‌డుతుండ‌గా పేరెంట్స్ అత‌డిని ఊర‌డిస్తున్నారు. అందులో భాగంగానే అత‌డికి బాగా వ‌చ్చిన ఏబీసీడీ సాంగ్ పాడ‌మ‌ని చెప్ప‌గా.. వాడు భ‌యం భ‌యంగా ఆ పాట పాడిన తీరు నెటిజ‌న్‌ల‌ను ఫిదా చేస్తున్న‌ది.

పాట పాడ‌ట‌మే కాదు, బుజ్జిబుజ్జి మాట‌ల‌తోనూ బుడ్డోడు అబ్బుర‌ప‌రిచాడు. అంతేకాదు ఆ బుడ్డోడిలో భ‌యం పోగెట్టేందుకు బార్బ‌ర్ ప్ర‌శ్న‌లు అడుగుతుండగా వాడు బెరుకు బెరుగ్గా స‌మాధానాలు చెప్పిన తీరు కూడా నెటిజ‌న్‌ల‌ను ఆక‌ట్టుకున్న‌ది. అందుకే ఆ వీడియోకు లైకులు, కామెంట్ల వ‌ర్షం కురుస్తున్న‌ది. మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం..? ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేసి ఎంజాయ్ చేయండి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
హెయిర్‌క‌ట్ చేస్తుంటే బుడ్డోడి ఏబీసీడీ సాంగ్‌.. వైర‌ల్ వీడియో

ట్రెండింగ్‌

Advertisement