శుక్రవారం 23 అక్టోబర్ 2020
National - Sep 15, 2020 , 18:20:53

నీరు వీడెక్కితే చాలు.. కెటిల్ మీదున్న రాకెట్స్ గిర్రున తిరుగుతాయి!

నీరు వీడెక్కితే చాలు.. కెటిల్ మీదున్న రాకెట్స్ గిర్రున తిరుగుతాయి!

మ‌నుషుల్లో సృజనాత్మకతకు పరిమితి లేదు. ఇది వ‌ర‌కు కెటిల్  లేదా టీపాట్ అంటే సిల్వ‌ర్ క‌ల‌ర్ పాత మోడ‌ల్‌లో ఉండేవి. ఇప్పుడు అవి కాస్త పింగాని మోడ‌ల్‌లో అవ‌తార‌మెత్తాయి. ఇప్పుడు ఏకంగా క‌నిపెట్ట‌లేనంతగా రూపుదిద్దుకున్నాయి. 33 సెకండ్ల‌పాటు న‌డిచే వీడియోలో స్ట‌వ్ మీదున్న‌ కెటిల్ హీట్‌కు గుర‌వ్వ‌గానే దాని మీదున్న రాకెట్ సింబ‌ల్స్ గుర్రున తిరుగుతుండ‌డం చూడ‌వ‌చ్చు. ఇలా తిర‌గ‌డానికి కార‌ణం కెటిల్‌లో ఉన్న నీరు వేడెక్క‌డ‌మే.

ఈ వీడియోను కాట్యా ట్విట‌ర్‌లో పంచుకున్నారు. కెటిల్ కామెన్ట్సెయిన్ వ‌రల్డ్ ఆఫ్ మోష‌న్ లైన్ కెటిల్స్ నుంచి వ‌చ్చింది. ఈ వీడియో ఆన్‌లైన్‌లోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి 2.9 మిలియ‌న్ల మంది వీక్షించారు. ఈ వీడియోను చూసి కొంత‌మంది నెటిజన్లు త‌మ బాల్యాన్నినెమ‌రువేసుకున్నారు. '20 ఏండ్ల క్రితం నేను మా అమ్మ పుట్టిన‌రోజు నాడు గిప్ట్‌గా కెటిల్ కొనిచ్చాను. ఆమె మ‌ర‌ణించిన త‌ర్వాత తిరిగి పొందాల‌నుకున్నా'ను అనే కామెంట్‌ను ఓ యూజ‌ర్ పోస్ట్ చేశారు.       


logo